శ్రీ ఉషోదయ విద్యాలయ పూర్వ విద్యార్థుల ఔదార్యం

మానసిక వికాస కేంద్రానికి పదివేల రూపాయల విరాళం అందజేస్తున్న పూర్వ విద్యార్థులు 

-శ్రీ ఉషోదయ విద్యాలయ పూర్వ విద్యార్థుల ఔదార్యం 

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని నేలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉషోదయ రెసిడెన్షియల్ విద్యాలయం పూర్వ విద్యార్థులు తమ ఔదార్యం ప్రదర్శించారు. 1990- 91 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు మంగళవారం ఖమ్మంలోని మానసిక వికలాంగుల కేంద్రాన్ని సందర్శించారు. అట్టి కేంద్రంలో నిర్వాహకులు దివ్యాంగ విద్యార్థులకు చేస్తున్న సేవలను విద్యా బోధన వారిలో మానసిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు చేస్తున్న కార్యక్రమాలను చూసి చలించిపోయారు.పాఠశాలలో నిర్వాహకులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.గత అనేక ఏళ్లుగా మానసిక విద్యార్థులకు సేవలు చేస్తున్న ప్రభుత్వం గుర్తించకపోవడంతో పాటు ఎటువంటి నిధులను మంజూరి చేయడం లేదని నిర్వాహకులు తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. దాతలు అందించిన సహాయ సహకారాలతోనే మానసిక వికాస కేంద్రాన్ని అనేక సమస్యల నడుమ కొనసాగిస్తున్నట్లు తెలిపారన్నారు. మానసిక వికాస కేంద్రంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వాహకుల చెప్పిన మాటలు విన్న పూర్వ విద్యార్థులు మానసిక వికాస కేంద్రం పేరుతో విద్యార్థులకు చేస్తున్న సేవలు వెలకట్టలేనిదిగా భావించి తమ సంఘం తరఫున కొంత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అందరిని సంప్రదించి పదివేల రూపాయల నగదును పోగేసి మానసిక వికాస కేంద్రం నిర్వాహకులకు విద్యార్థుల భోజన ఖర్చుల నిమిత్తం అందజేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉసిరికాయల శ్రీను రమేష్ సత్యనారాయణరెడ్డి లింగస్వామి చల్లగుండ రమేష్ మీరా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking