వాగీష్ కుమార్ సింగ్ కు ఘన స్వాగతం

ఎన్నికల వ్యయ పరిశీలకులు వాగీష్ కుమార్ సింగ్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి

  ములుగు, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 03 నుండి 10వ తేదీ వరకు జరగనున్న నామినేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్నికల వ్యయ పరిశీలకులు వాగీష్ కుమార్ సింగ్ కు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి పూల మొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ములుగు జిల్లా మ్యాప్
లో ములుగు నియోజకవర్గం, మండలాలు, పోలింగ్ కేంద్రాలు, తదితర వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరించారు.

కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ములుగు రిటర్నింగ్ ఆఫీసర్ అంకిత్, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking