మార్నింగ్ వాకర్స్ తో భాస్కర్ రావు మాటామంతి

మార్నింగ్ వాకర్స్ తో భాస్కర్ రావు మాటామంతి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్నింగ్ వాకర్స్ మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ములాఖత్ అయ్యారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మార్నింగ్ వాకర్స్ తో పాటు ఓపెన్ జిమ్ చేస్తున్న పలువురిని ఎమ్మెల్యే ఆత్మీయంగా కలుసుకున్నారు. పట్టణంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరించారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. సమగ్ర పట్టణాభివృద్ధి కొనసాగడం కోసం మరోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, 30న జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్ ఉదయభాస్కర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పి. శ్రీనివాసరెడ్డి నాయకులు మన్నెం శ్రీనివాసరెడ్డి, ఘంటా శ్రవణ్ రెడ్డి, సక్రాంనాయక్, కుర్ర కృష్ణకాంత్, వాంకుడోతు సురేష్ నాయక్, రహమాన్ ఖాన్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking