గాంధీకి పూర్తి మద్దతు

ఎన్నికల్లో పూర్తి స్థాయి మద్దతు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీకే… వెంకటేశ్వర నగర్ సగర (ఉప్పర) సంఘం ఏకగ్రీవ తీర్మానం..

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ సగర (ఉప్పర) సంఘం వారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీకి సంపూర్ణ మద్దతు తెలియచేస్తూ ఏకగ్రీవ తీర్మానం పత్రంను మాజీ కార్పొరేటర్ మాధవర రంగరావుతో కలిసి అరెకపూడి గాంధీకి అందజేశారు. ఈ సందర్భంగా సగర సంఘం సభ్యులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే ఉంటుందని, అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. మేము అంతా ఐక్యం గా ఉండి బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలకు కట్టుబడి ఉంటాం అని, ఆయన గెలుపు కోసం కృషి చేస్తాం అన్నారు.నిత్యం అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలుగా అండగా ఉంటారని, శేరిలింగంపల్లి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, అనేక అబివృద్ది కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా కృషి చేశారని కొనియాడారు.
ఈ సంధర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని కోట్లాది రూపాయల నిధులతో శే లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలతో ఈసారి విజయం సాధిస్తానని దీ మా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ సగర (ఉప్పర) సంఘం అధ్యక్షులు ఆర్కె. దయాసాగర్, ప్రధాన కార్యదర్శి అస్కాని శ్రీనివాస్ సాగర్, కోశాధికారి వేముల సుదర్శన్ సాగర్, కె.పి రాములు సాగర్, రాము సాగర్, గిన్నె భీమయ్య సాగర్ ,ఎం. రాములు సాగర్, కొండయ్య సాగర్, రామకృష్ణ సాగర్, గిన్నె రాము సాగర్, చంద్రమోహన్ సాగర్, తిరుపతమ్మ సాగర్, ఆర్ డి .శాంతా సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking