కోరిన కోరికలు తీర్చే కొడవలూరు సిద్దేశ్వరుడు….
నేటి నుండి ప్రారంభం కానున్న సిద్దులగుట్ట బ్రహ్మోత్సవాలు….
శివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఆలయ సిబ్బంది….
శాంతి భద్రతల విషయంలో డిసిపి ఏసిపి పకడ్బందీ ఏర్పాట్లు….
జనగామ, అక్షిత ప్రతినిధి:
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొడవటూరు సిద్ధేశ్వరుడి ఆలయచరిత్ర….స్వయంభూలింగ
రూపంలో సిద్ధులగుట్టలో వెలిసిన సిద్ధేశ్వరుడు ఏడాదికి చింతాకు పరిమాణం చొప్పున పెరగడం
ప్రత్యేకత. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక గణనీయంగా పెరుగుతోంది… ఆలయ చరిత్ర గురించి ప్రధానార్చకులు ఓంనమఃశివాయ…తెలిపిన వివరాల ప్రకారం.. 1693లో శ్రీమహంత స్వామి అనే వ్యక్తికి
శివుడు కలలో కనిపించి, తాను గుట్టపై లింగ రూపంలో వెలిశానని చెప్పిఅదృశ్యకావటంతో, మహంత స్వామి గుట్ట అంతా కలియ తిరుగుతూ గుహలోచిన్నపాటి కొబ్బరి బోండాం సైజులో ఉన్న లింగాన్ని గుర్తించి నిత్య పూజలు
నేటి నుండి కొడవటూరులో బ్రహ్మోత్సవాలు
ప్రారంభోత్సవం మహంత స్వామికి ముందు ఆ ప్రాంతంలో సిద్దులు నివాసమేర్పర్చు
కుని పూజలు జరిపినట్టు ఆధారాలు లభ్యమవ్వటంతో సిద్దులగుట్టగా నామక
రణం చేసి ప్రాచుర్యంలోకి తీసుక వచ్చారు. ఈగుట్ట నుంచి సిద్దెంకి, కొన్నెగుట్టలకు, కొలనుపాకకు, సొరంగ మార్గాలున్నాయి. పూర్వం రుషులు ఈ మార్గాల గుండా ప్రయాణించేవారని, కాలక్రమేణా ఇందులో పులులు, ఇతర క్రూర మృగాలు
నివాసాలు ఏర్పర్చుకోవటంతో వాటిని మూసివేశారు…
సంవత్సరానికి చింతాకుమంతం పెరుగుతున్న
శివలింగం..
ఆలయంలో వెలిసిన శివలింగం యేటా చింతాకు పరిమాణం పెరుగుతూ వస్తోంది. ఇందుకు గతంలో స్వామి వారికి భక్తులుచేయించిన నాగపడిగెలను పూజారులు సాక్ష్యంగా చూపుతు
న్నారు. గుట్టపై సహజ సిద్ధంగా ఏర్పడిన రెండు కోనేరులతో పాటు, కప్పుగుండం ఉన్నాయి. ఆలయానికి దిగువనఉన్న బావిలోని నీరు పసరికలు నయం కావటానికి
దోహదపడుతాయని భక్తులు విశేషంగా నమ్ముతారు.
నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
బుధవారం నుండి నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి… 6న గంగపూజ, 7నరుద్రాభిషేకం, 8న రాత్రి శివకల్యాణం, 9న అగ్ని గుండప్రవేశంతో…ఉత్సవాలు ముగుస్తాయి….