ఏరియా ఆస్పత్రి తనిఖీ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని గురువారం ఆకస్మికంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ సందర్శించి ఉదయం రావాల్సిన డాక్టర్లు సమయానికి ఆసుపత్రిలో లేకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి హెచ్చరించారు. ఆసుపత్రిలోని మహిళ, ప్రసూతి, క్యాజువలిటీ, చిన్న పిల్లల వార్డులు కలియ తిరిగారు.
అలాగే ఆసుపత్రి పరిసరాలు, రోగులు ఉండే వార్డులన్నీ పరిశుభ్రంగా ఉంచాలని వారిని ఆదేశించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంటే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హాస్పిటల్ వైద్యులు, సిబ్బందిపై మండిపడ్డారు. ఆసుపత్రిలో ఉన్న గ్రామస్థులు, రోగులతో మాట్లాడారు, వైద్యం ఎలా జరుగుతున్నదని అడిగి తెలుసుకున్నారు.