పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా హోలీ సంబురాలు
వరంగల్, అక్షిత బ్యూరో:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించుకున్నారు. హోలీ పండుగను పురస్కరించుకోని ఉదయాన్నే వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ అధికారులు,సిబ్బంది కల్సి ముందుగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు రంగులు రాయడంతో పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో హోలీ సంబురాలు ప్రారంభమయినాయి.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సైతం అధికారులు,సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్, అధికారులు, సిబ్బంది,మీడియా ప్రతినిధులు, సిబ్బంది సైతం ఎలాంటి బేధాలు లేకుండా నృత్యాలు చేసారు. అనంతరం ఈ సంబురాల్లో పాల్గోన్నవారికి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మిఠాయిలను అందజేసారు. ఈ వేడుకలను పురస్కరించుకోని పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంల్లో సంతోషాలు, వెల్లువిరియాలని,ఈహోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు.
ఈ వేడుకల్లో డిసిపిలు అబ్దుల్ బారి, రవీందర్, అదనపు డిసిపిలు రవి, సంజీవ్, సురేష్‌కుమార్‌తో పాటు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.