అణగారిన జీవితాలకు అక్షరధారులు అంబేద్కర్-పూలే

అణగారిన జీవితాలకు అక్షరధారులు అంబేద్కర్-పూలే

కవి,రచయిత ఏబూషి నర్సింహ్మ

భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆద్వర్యంలో పూలే-అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

నకిరేకల్ అక్షిత ప్రతినిధి :

అణగారిన జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులు జ్యోతీరావు పూలే-అంబేద్కర్ అని తెలంగాణ సాహితీ హైదరాబాద్ నగర అధ్యక్షులు,కవి ఏబూషి నర్సింహ్మ అన్నారు. మునిపంపుల గ్రామంలో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆద్వర్యంలో జ్యోతిరావు పూలే-అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్బంగా నిర్వహించిన సెమినార్ కు ముఖ్య వక్తగా హాజరయ్యి మాట్లాడుతూ అంటరానితనం,అసమానతలు రూపుమాపడం కోసం తమ జీవితాలను త్యాగం చేసి చరిత్రలో నిలిచారు. చదువు అందరి హక్కు అని క్రింది వర్గాలకు చదువును అందించి చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించారు.

భూమి పంచాలని,పరిశ్రమలు జాతీయం చేయాలని,అందరికీ సమాన హక్కులు కల్పించాలని పోరాడినవారు. నేటి యువత పూలే,అంబేద్కర్ మార్గాన్ని అనుసరించి నయా ఆదిపత్యాన్ని దునుమాడేందుకు కంకనబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు బొడ్డుపల్లి వెంకటేశం,గంటెపాక శివ కుమార్,తొలుపునూరి చంద్ర శేఖర్,గాదె శోభారాణి,యాదాసు దుర్గయ్య,జంపాల అండాలు,నోముల రమేష్,భూడిద భిక్షం,మేడి బాషయ్య,గంటెపాక శ్రీధర్,జంపాల దినేష్,బత్తిని సందిప్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking