పేదల సంక్షేమానికి పెద్దపీట

పేదల సంక్షేమానికి పెద్దపీట

కేంద్ర సమాచార, ప్రసారశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్వనీ వైష్ణవ్‌

 ప్రజాసేవకే అంకితమై… పేదల సంక్షేమానికే మొదటి కేబినెట్‌ నిర్ణయం 

అశ్వనీ వైష్ణవ్‌

హైదా రాబాద్, అక్షిత ప్రతినిధి :

కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా అశ్వనీ వైష్ణవ్‌ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై ఉందని అన్నారు. నిన్న జరిగిన మొదటి కేబినెట్‌ సమావేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న నిర్ణయం పేదల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనం అన్నారు. దేశ ప్రజలకు తమ ప్రభుత్వం నిరంతరం సేవ చేస్తూనే ఉంటుందని అన్నారు.కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే మీడియా యూనిట్లు, ఇతర ప్రభుత్వ అధికారులు మంత్రి వైష్ణవ్‌ కు స్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking