పేదలకు నాణ్యమైన విద్య
బిఏఎస్ కు విద్యార్థుల ఎంపిక
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1 వ తరగతి, 5వ తరగతి ఎస్సి విద్యార్థిని, విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా ఎంపిక చేశారు.మంగళవారం నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ లో జిల్లా రెవిన్యూ అధికారి రాజ్య లక్ష్మి డ్రా తీసి బెస్ట్ అవైలబుల్ పథకానికి విద్యార్థిని విద్యార్థుల ఎంపిక ను ప్రారంభించారు.
ఈ పథకానికి 134 మంది విద్యార్థిని, విద్యార్థులను ఒకటవ తరగతికి ఎంపిక చేయగా, మరొక 20 మంది విద్యార్థిని, విద్యార్థులను అధనంగా ఎంపిక చేశారు.అలాగే 137 మంది విద్యార్థిని విద్యార్థులను 5వ తరగతికి ఎంపిక చేశారు.5 వ తరగతిలో సైతం మరొక 20 మందిని అదనంగా ఎంపిక చేయడం జరిగింది. ఎవరైనా నిర్దిష్ట సమయంలో జాయిన్ కానీ ఎడల అదనంగా ఎంపిక చేసిన 20 మంది నుండి ఆ సీట్లని నింపుతారు.డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మితో పాటు, గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్, బీసీ సంక్షేమ అధికారి రమేష్, తదితరులు ఉన్నారు.