విత్తన దుకాణాల తనిఖీ : ఎడిఎ నాగమణి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి:
మిర్యాలగూడ పట్టణంలోని విత్తన దుకాణాలను మంగళవారం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పొరెడ్డి నాగమణి తనిఖీ చేశారు. పిసిలు, ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. విత్తన పాకెట్లపై లేబుళ్లు ఇతర వివరాలు పరిశీలించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలు పక్కాగా రికార్డు నమోదు చేయాలని వ్యాపారస్తులకు సూచించారు. విత్తన ధరలు స్టాక్ వివరాలు దుకాణం ఎదుట స్టాక్ బోర్డుపై ప్రదర్శించాలన్నారు.
ఎవరైనా నాణ్యతలేని విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ ఉన్న దుకాణాలలో మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని వంటకాలం పూర్తయ్యే వరకు రైతులు విత్తన ప్యాకెట్టు, రసీదును భద్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గుర్రం సరిత పాల్గొన్నారు.