కబ్జాలకు పాల్పడితే…సహించం

కౌన్సిలర్ మరో వ్యక్తిపై ల్యాండ్ గ్రాబింగ్ కేస్ నమోదు..

ప్రభుత్వ స్థలాలలో కబ్జాలకు పాల్పడితే సహించలేదు కేసులు నమోదు చేస్తాం..

గండి మైసమ్మ మండల తాసిల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్..

మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధి ఎనిమిదో వార్డు కౌన్సిలర్ సాయి యాదవ్ఎ 2అడవి కిరణ్ స్వామి ఎ1 ల్యాండ్ గ్రాబింగ్ కేస్ నమోదు అయింది.గండి మైసమ్మ మండల తాసిల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు గత నెల 30వ తేదీన పోలీసులకు కౌన్సిలర్ పై ప్రభుత్వ భూములు అక్రమ కేసు నమోదు చేశారని పోలీసుల కథనం ప్రకారం దుండిగల్ మండలoలోని సర్వేనెంబర్ 120 ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు తో పాటు సర ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం రాత్రి రాత్రికి గదుల నిర్మాణం చేయడం అమాయకులకు మాయమాటలు చెప్పి విక్రయించడంలో ప్రముఖ పాత్ర వహించినట్లు గుర్తించారు.

మండల రెవెన్యూ అధికారులు దుండిగల్ పోలీసులకు మండల రెవెన్యూ గిర్దావరి ప్రదీప్ రెడ్డి స్వయంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కౌన్సిలర్ సాయి యాదవ్ ఐపిసి. 447. 427. 186 ఆర్ /డబ్ల్యు 34 . ఐపిసి.పీడీ.పీపీఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking