చెత్త కంపు… వాసన పారిశుధ్య పడకేసినట్లేనా..?

చెత్త కంపు… వాసన పారిశుధ్య పడకేసినట్లేనా..?

భారీ వర్షాలతో ముదురుతున్న దోమలు బెడద క్రిమి కీటకాలు నిద్ర మత్తులో సానిటేషన్ విభాగం..

పురపాలకలో దోమల బెడదతో మలేరియా డెంగు జరాలు వ్యాపిస్తు రోగాల బారిన పడుతున్న కాలనీ వాసులు…

మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక లో పరిసరాలు పరిశుభ్రంగా పేరుకేనా. స్వచ్ఛ సర్వేక్షన్ లో శానిటేషన్ విభాగం ఏమైనట్లు పట్టించుకోరా.కాలనీలో ఎక్కడ చెత్త అక్కడే చెత్త కంపు వాసనతో కాలనీవాసులు రోగాలు బారిన పడుతున్న అధికారులు మొద్దు నిద్రలో ఉండడం గమనార్హం.? ఓ వైపు ఏడా పెడా కురుస్తున్న భారీ వర్షాలు,మరో వైపు రహదారులపై పేరుకు పోతున్న చెత్తా చెదారంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు,డి.పోచంపల్లి సర్వే నంబర్ 120 డాక్టర్ బస్తి,చంద్రశేఖర్ రెడ్డి కాలనీ,సాయి పూజా కాలనీలలో రోడ్లపై చెత్తా చెదారం పేరుకు పోతుండడంతో దోమలు,క్రిమికీటకాలు వ్యాపించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్తకుండీలను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన మున్సిపల్ సిబ్బంది వారాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో దోమలు, క్రిమికీటకాలు వ్యాపంచి స్థానికుకులు రోగాల బారిన పడుతుండడం ఆందోళన కలిగించే విషయం.

మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకో వడంలేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,సర్వే నంబర్ 120 డాక్టర్ బస్తీలో రోడ్లపై చెత్తాచెదారం పెరుకుపోవడంతో నడవలేని పరిస్థితి గోచరిస్తుంది,అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking