యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

థర్మల్ పవర్ స్టేషన్ పనులపై వైటిపిఎస్ అధికారులతో సమీక్ష

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. పనుల పురోగతిపై ఆయన వైటిపిఎస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పనులు నడుస్తున్న తీరును అధికారులతో కనుక్కోవడమే కాకుండా, పనులు జరిగే ప్లాంట్ కు వెళ్లి ప్రత్యక్షంగా పనులను పరిశీలించారు.

థర్మల్ పవర్ స్టేషన్ కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే పరిష్కరించాలని మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావును ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేసే కార్మికులు జ్వరాల బారిన పడుతున్నారని పత్రికలలో వచ్చిన వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్ కార్మికులు జ్వరాల బారిన పడకుండా చూసుకోవాలని, వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్లాంట్ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ తిరిగి పరిశీలించారు.వైటిపిఎస్ కు సంబంధించి భూసేకరణ బకాయిలు ఉన్నట్లయితే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్డీవోను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ తో పాట వైటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, వైటిపిఎస్ డిఎస్పి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking