లక్ష్మణ్ రావు సేవలు చిరస్మరణీయం : భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
కటికనేని లక్ష్మణ్ రావు సేవలు చిరస్మరణీయమని మాజీ శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్ రావు కొనియాడారు. లక్ష్మణ్ రావు 80వ జయంతిని పురస్కరించుకొని పెద్దఅడిశర్లపల్లి మండలంలో అంగడిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని మాట్లాడారు. కటికనేని లక్ష్మణ్ రావు విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన దామరచర్ల జడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం నాయక్, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.