యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
– ముఖ్య అతిథులుగా నకిరేకల్ ఎమ్మెల్యే
– హాజరై అవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
మండలంలోని భోగారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై అవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భోగారం గ్రామంలో మహనీయుడు, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అని కొనియాడారు.
అదేవిధంగా విగ్రహ దాత కూనూరు సాయి కుమార్ గౌడ్ కు, వివిధ రూపకంగా దాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏ పదవిలో ఉన్న, ఎక్కడ రిజర్వేషన్ ఉన్నాయన్న, ప్రతి ఒక్కరూ ఎక్కడైనా దేనికైనా పోటీ చేసి ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నామంటే ఆ మహనీయుడి రాసిన రాజ్యాంగ ఫలితమే అన్నారు.
నేను ఎమ్మెల్యే అవడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమే కాబట్టి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా గ్రామానికి ఒక హామీ ఇస్తానని తెలిపి, ప్రభుత్వ త్వరలో ఇవ్వబోయే ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులను ఎంపిక స్వయంగా అధికారులను సమన్వయం చేస్తూ దగ్గరుండి అర్హులను ఎంపిక చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం వికాస్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడిన తర్వాత విగ్రహ దాత కూనూరు సాయి కుమార్ గౌడ్ కు షీల్డ్ అందజేసి శాలువాతో సహకరించిన అందరికీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూస బాలమణి బాల నర్సయ్య, స్థానిక ఎంపీటీసీ గోగు పద్మ సత్తయ్య యాదవ్, విగ్రహ ప్రతిష్ఠ కమిటీ అధ్యక్షులు రవీందర్, అంబేద్కర్ సొసైటీ అధ్యక్షులు మేడి కృష్ణ, మేడి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మద్దేపురి ఐలయ్య, విగ్రహ దాత కూనూరు సాయి కుమార్ గౌడ్, డాక్టర్ బొడ కాషయ్య, కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు గాదె శోభరాణి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండీ జమీరొద్దిన్ ఎండీ అక్రమ్, వనం చంద్ర శేఖర్, జెల్ల వెంకటేశం, గొదాసు పృధ్వీరాజ్, సాల్వేరు లింగం, కూనూరు గోపాల్, గంపల రాంచంద్ర రెడ్డి, బోగ శంకరయ్య, రాపోలు బలరాం, రచ్చ ఆనంద్, కడారి పాపయ్య, గోగు హరిప్రసాద్, కూనూరు రాజు, కూనూరు బక్కులు, నేరేటి రమేష్, గంపల శ్రీపతి రెడ్డి, గోశిక వెంకటేశ్వర్లు, నేరెటి సురేష్, గోగు కిష్టయ్య, బిఎన్ యాదవ్, జెల్ల శ్రీనివాస్, గోగు సురేష్, రాంబాబు, రాపోలు గణేష్, మేడి స్వామి, చింతల మల్లేష్, మేడి నర్సింహా, మేడి రామలింగం, మేడి తాత నర్సింహా, మేడి స్వామి, మేడి హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.