ఇసుక అక్రమ రవాణా
చేస్తే కఠిన చర్యలు
మిర్యాలగూడ ఆర్డీఓ జి.శ్రీనివాస్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని మిర్యాలగూడ ఆర్డీఓ జి.శ్రీనివాస్ రావు హెచ్చరించారు. మంగళవారం మిర్యాలగూడ మండలం తడకమళ్ల, తక్కెళ్లపాడు గ్రామపంచాయతీ కార్యాయాలలో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తరచూ కొంతమంది అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఇప్పటి నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తే సహించేది లేదని కఠినంగా చర్యలుంటాయని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
అదేవిధంగా నిర్ణీత ఇసుక రీచుల్లో ఇసుక అనుమతులు తీసుకుని రవాణా చేయాలని కోరారు. సమావేశాల్లో తహసీల్దార్ ఎన్.హరిబాబు, ఎంపీడీఓ ఎం.శేషగిరిశర్మ, రూరల్ ఎస్ఐ కె.నరేష్, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.