దోషులను కఠినంగా శిక్షించాలి

తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య

– ప్రభుత్వమే బాధ్యత వహించాలి

– దోషులను కఠినంగా శిక్షించాలి

– బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి ప్రియదర్శిని డిమాండ్

నకిరేకల్ అక్షిత ప్రతినిధి

బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి ప్రియదర్శిని డిమాండ్ చేశారు. పెరంబూర్‌లోని తన ఇంటి సమీపంలో కొందరు పార్టీ కార్యకర్తలతో ఆర్మ్‌స్ట్రాంగ్ మాట్లాడుతుండగా, ఆరుగురు దుండగులు దాడి చేశారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు పదునైన ఆయుధాలతో ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపి పరారయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే ఆర్మ్‌స్ట్రాంగ్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతేడాది ఆర్కాట్ సురేష్ అనే గ్యాంగ్‌స్టర్ హత్యకు ఆర్మ్‌స్ట్రాంగ్‌కు సంబంధం ఉందని, ప్రతీకార కోసమే హత్యే అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను మేడి ప్రియదర్శిని తీవ్రంగా ఖండించారు. స్టాలిన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు. హత్యపై స్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్మ్‌స్ట్రాంగ్‌ను దళితుల బలమైన గొంతుగా అభివర్ణించారు. దోషులను కఠినంగా శిక్షించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో బిజెపి అధికారం లోకి వచ్చాక మత పరమైన, కుల వివక్షతో కూడిన హత్యలు పెరిగాయని, ప్రశ్నించే వారిపై దాడులు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ లపై, మహిళలపై దాడులు పెరిగాయన్నారు.ఇలాంటి ఘటనలు అణిచివేసి, నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయ స్థానాలు కూడా ఇలాంటి ఘటనలు కేసులను వేగంగా విచారణ జరిపించలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking