స్నేహితుని కుటుంబానికి ఆర్ధిక చేయూత

స్నేహితుని కుటుంబానికి సహృదయంతో ఆర్థికసహాయం అందజేత

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో చిన్ననాటి స్నేహితుడు కొమ్ము కృష్ణకు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ పోషణ కూడా వెళ్లదీయలేని పరిస్థితిలో కృష్ణ జీవనం గడుపుతుంటే చిన్ననాటి మిత్రులు 2000 2001 సంవత్సరం టెన్త్ క్లాస్ బృందం సాహృదయంతో స్పందిస్తూ నీ వెన్నంటి మేమున్నామంటూ భరోసానిస్తూ తనకు నిత్యవసర వస్తువులు ,బియ్యం, సుమారుగా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు, ఈ సందర్భంగా స్నేహితుని ఆరోగ్యం త్వరలో బాగుపడాలని ఆ రకంగా తమ వంతు సహాయం ఎల్లవేళలా అందిస్తామని ఆ కుటుంబానికి ధైర్యం కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, పబ్బు ధనుంజయ, కొమ్ము రవి, నోముల యాదగిరి, నోముల శంకర్, ఎర్ర నరేష్, ఉప్పు శ్రీనివాస్, తెలుసురి మల్లేశం, కృష్ణకు ఆర్థిక సహాయం అందించిన తమ తోటి క్లాస్మేట్లకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking