ఉద్యమ నేత డా.అశోక్ కి కోదండరాం సన్మానం
డాక్టరేట్ అందుకున్న వేళ ప్రత్యేక అభినందన
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో తనతో పాటు పోరాటాలు చేసిన ఉద్యమ నేత డాక్టర్ ఎర్రోళ్ల(ఎన్) అశోక్.. ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకోవడం గొప్ప విషయమని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఓయూ నుంచి ఇటీవలె డాక్టర్ అందుకున్న రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన డా.అశోక్ ని హైదరాబాదులోని తన నివాసానికి కోదండరాం పిలిచి శాలువతో ఆదివారం ఘనంగా సత్కరించారు. ‘రాజకీయాల్లో వికలాంగుల ప్రత్యేక పాత్ర’ అనే అంశంపై పరిశోధన చేసిన అశోక్ ని అభినందించారు. అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా భవిష్యత్తులో ఉన్న స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వికలాంగుల చట్టం(2016)ను చట్టసభల్లో అమలుపరిచేలా కృషి చేయాలని కోదండరాంని అశోక్ కోరగా.సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు అశోక్ తెలిపారు. అనంతరం తన గురువు కోదండరాంని డా.అశోక్ శాలువాతో సన్మానించి పాదాభివందనంతో ఆశీస్సులు అందుకున్నారు.
అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, మద్యం అనర్ధాల పట్ల యువత, సమాజానికి అవగాహన కలిగే విధంగా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తున్న యువ జర్నలిస్టు తలారి గణేష్ ని అభినందించారు. ఇటీవలే రాసినటువంటి ‘పల్లెల్లో పాగా వేస్తున్న డ్రగ్స్, గంజాయి, మద్యం’ అనే ఆర్టికల్ ని ఫోన్ లో చదివి.. ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ రాయాలన్నారు. వాటన్నింటిని ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని గణేష్ కి కోదండరాం సూచించారు. కార్యక్రమంలో జినుక గోవర్ధన్, మహేష్ గోపాల్, జిడిగే వెంకటేశ్వర్లు, ఎర్రోళ్ల రాకేష్ ఉన్నారు.