నిరుద్యోగులకు వరం ఖమ్మం బిసి స్టడీసర్కిల్
-గ్రూప్ వన్ మెయిన్స్ కి 84 మంది ఎంపిక
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయంటే నిరుద్యోగులు ముందుగా ఆలోచించేది ఆ పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ తీసుకోవడం గురించే ఇందుకు వేలాది రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి పేదవారికి సాధ్యం కాదు. అలాంటి వారికోసం వరంలా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి సంస్థ శిక్షణ కేంద్రం (తెలంగాణ బిసి స్టడీ సర్కిల్) వివిధ పోటీపరిక్షలకు ఉచిత శిక్షణను ఇస్తూ ఎంతో మంది పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.
ఈ స్టడీ సర్కిల్ శిక్షణ విధానం
నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో 2010వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీ స్టడీ సర్కిల్ బీసీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 12 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసారు. అందులో ఒకటి ఖమ్మం నగరంలోఉంది. అప్పటి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ ప్రవేశ ఉద్యోగ పరీక్షలకు ఇక్కడ ఉచితంగాశిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రము ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టడీ సర్కిల్ పేరును తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం (తెలంగాణ బిసి స్టడీ సర్కిల్ ) గా పేరు మార్చింది. ఈ శిక్షణ కేంద్రం ఖమ్మం లోని బైపాస్ రోడ్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉంది.స్టడీ సర్కిల్లో శిక్షణ పొందగోరే అభ్యర్థులకు కొన్ని నియమ నిబంధనలను నిర్ణయించారు.కొన్ని శిక్షణలకు పదవతరగతి, ఇంటర్ డిగ్రీలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తుండగా సివిలు సర్వీసెస్ మరియు గ్రూప్స్ కి ఆన్లైన్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తుంటారు.
-శిక్షణ పొందే అభ్యర్థులు వారు రాయాల్సిన పరీక్షకు మరియు స్టడీ సర్కిల్ వెబ్ సైట్ నందు కూడా ఆన్ లైన్ ద్వారా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని ఉండాలి.
-తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర మరియు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలకు మించకుండా ఉండాలి.
-సంవత్సరంలో ఒక అభ్యర్థి ఒక్కసారి మాత్రమే ఉచిత శిక్షణను వినియోగించుకోవాలి.
-బిసిలకు 75 శాతం ఎస్సి లకు 15 శాతం ఎస్టీలకు 5 శాతం వికలాంగులు అనాధలకు 5 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది.
వేలాది మందికి శిక్షణ
2010 లో ఏర్పాటు అయిన ఈ స్టడీ సర్కిల్లో ఇప్పటి వరకు సివిల్స్ ప్రాథమిక పరీక్ష, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, బ్యాంకు క్లర్క్ బ్యాంకు పిఓ ఐబిపిఎస్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సిఆర్పిఎఫ్ పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ విఆర్ఓ విఆర్ఏ పంచాయితీ సెక్రటరీ సింగరేణి యల్ఐసి ఎక్సైజ్ కానిస్టేబుల్ డీఎస్సీ గురుకల ఫారెస్ఆఫీసర్స్ తదితర ఉద్యోగాలకు శిక్షణ ఇస్తోంది. ఈ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న వందలాది మంది విద్యార్థులువివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించారు.
స్టడీ సర్కిల్ ప్రధాన ఉద్దేశాలు
-యువతలో పోటీతత్వాన్ని పెంపొందించడం.
-విస్తృత స్థాయి లైబ్రరీ సదుపాయం.
-యువతలో విద్య, ఉపాధి, ఉద్యోగ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటం.
-ఉద్యోగ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడం.
-ఆదునిక టెక్నాలజీ సహాయంతో బోదన చేయటం.
-విశేష అనుభవం, నైపుణ్యం కలిగిన అధ్యాపకులచే పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం.
-క్విజ్ పోటీలు నిర్వహించడం,
-వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ.
-పోటీ పరీక్షలకు సంబంధించి ఆంగ్లంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం.
-విద్యార్థులలో స్పూర్తిని నిపేందుకు నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించడం.
-ఒత్తిడి దరిచేరకుండా యోగమెడిటేషన్ మరియు మోటివేషన్ క్లాసులు నిర్వహించడం.
-శిక్షణ సమయంలో ఆ శిక్షణకు సంబందించిన అధికారులచే విద్యార్థులకు మోటివేషన్ క్లాసులునిర్వహించడం.
-అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఫౌండేషన్ మూడు నుండి నాలుగు నెలల పాటుతరగతులు నిర్వహించడం.
-రాష్ట్ర స్థాయిలో విశేష అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో బోధన ఉంటుంది.
-వివిధ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారితో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు
-బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేస్తారు.
-క్విజ్ పోటీలుమరియు ఓ.యం.ఆర్ షీట్ ద్వారా వారాంతపు మాసంతపు పరీక్షలను నిర్వహిస్తారు.
-శిక్షణ కాలంలో అభ్యరులకు టీ, స్నాక్స్ అందిస్తున్నారు.
-విశ్లేషణాత్మక, పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందచేస్తారు.
నాణ్యమైన శిక్షణ ఇవ్వడమే లక్ష్యం
ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నాణ్యమైన శిక్షణ
-జి.శ్రీలత
డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్
ఖమ్మం
పోటీ పరీక్షలకు అందించే ఉచిత శిక్షణ నిరంతరంగా కొనసాగుతుందని నిరుద్యోగ బీసీ యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వడం కోసం ఈ స్టడీ సర్కిల్ కృషి చేస్తోంది. ప్రైవేట్ కి దీటుగా అత్యంత నైపుణ్యం అనుభవం గల అధ్యాపకులచే శిక్షణ అందజేస్తున్నాం. సంబంధించినశిక్షణతో పాటు యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.అదే విధంగా బీసీ స్టడీ సర్కిల్లో 5.1 మరియు కానిస్టేబుల్ ఫలితాలలో 48 మంది ఎంపిక అయ్యారు. నిన్న విడుదలైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలలో బీసీ స్టడీ సర్కిల్ నుంచి 240 మందికి 83 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ కి క్వాలిఫై అయ్యారు నాణ్యమైన శిక్షణ తో పాటు మెటీరియల్ మాక్ టెస్ట్ లు మరియు వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ లు అభ్యర్థుల ఫలితాలకు దోహద పడ్డాయి.
గ్రూప్ 2 పరిక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం హైదరాబాద్ బిసి స్టడీ సర్కిల్ వారి అద్వర్యంలో సిలబస్ మొత్తం కవర్ అయ్యేలా రోజుకు రెండు గ్రాండ్ టెస్ట్ లు నిర్వహిస్తునాము కావున గ్రూప్ పరిక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.టెలిగ్రామ్ యాప్ ద్వారా సివిల్స్ ప్రిపేరయ్యే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి మాత్రమేకాకుండా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేవిధంగా అన్ని సబ్జెక్టులతో కూడిన బిట్స్ ను మరియు డైలీన్యూస్ పేపర్స్ క్లిప్పింగ్సునూ కూడా విద్యార్థుల వద్దకు తీసుకు వెళ్లేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ ప్రయత్నం చేస్తుంది.