పేద విద్యార్ధికి చేయూత

పేద విద్యార్థికి ఎన్నారై దాతల ఆర్థిక సహాయం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థి ఎస్కె నుమాన్ కు మిన్నేసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాట) ప్రతినిధులు కొప్పుల ప్రణీత్ రెడ్డి, రేగట్టె సౌమ్యారెడ్డిలు రూ. 30వేల ఆర్థిక చేయూతనందించారు. బుధవారం పట్టణంలోని అరోరా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ ప్రతినిధులు హెన్రీ మోసెస్, పవన్ కుమార్లు విద్యార్థి కుటుంబ సభ్యులకు నగదును అందజేశారు. విద్యార్థి ఉన్నత చదువులకు భవిష్యత్లో తమ వంతు ఆర్థిక చేయూతనందిస్తామని దాతలు పేర్కొన్నారు. పేద విద్యార్థి చదువుకు ఆర్థిక భరోసా కల్పించిన దాతలకు మన మిర్యాలగూడ ఆర్గనైజషన్ వ్యవస్థాపకుడు మన్నెం శ్రీధర్ రెడ్డి, మనోహర్, ఆవుల రమేష్ నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking