9వ రౌండ్ ఫలితాల వెల్లడి: మళ్లీ ఈటలే ముందంజ.. భారీ మెజారిటీ

9th round results Etela leading again with huge majority

    • 9వ రౌండ్ లో ఈటలకు 1,835 ఓట్ల ఆధిక్యం
    • బీజేపీకి 5,305.. టీఆర్ఎస్ కు 3,470 ఓట్లు
    • 5,105కు పెరిగిన ఈటల ఆధిక్యం

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో మళ్లీ ఈటల రాజేందర్ ముందంజలోకి వచ్చేశారు. ఎనిమిదో రౌండ్ లో వెనుకబడిన ఆయన.. తొమ్మిదో రౌండ్ లో దూసుకొచ్చేశారు. బీజేపీకి తొమ్మిదో రౌండ్ లో 1,835 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఈ రౌండ్ లో బీజేపీకి 5,305 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 3,470 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఇప్పటిదాకా ఈటలకు 40,412 ఓట్లు రాగా.. గెల్లుకు 35,307 ఓట్లు వచ్చాయి. దీంతో ఈటల మెజారిటీ 5,105 ఓట్లకు పెరిగింది.
Tags: Etela Rajender, BJP, Huzurabad, TRS, Gellu Srinivas Yadav, Congress, Balmoori Venkat

Leave A Reply

Your email address will not be published.

Breaking