ఈవిఎంలకు
పటిష్టమైన భద్రత
ఈవీఎం గోదాము తనిఖీ
కలెక్టర్ బి.సత్య ప్రసాద్
జగిత్యాల, అక్షిత ప్రతినిధి :
ఈవిఎంలను పటిష్టమైన భద్రత నడుమ భద్రంగా ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక దరూర్ క్యాంప్ లో గల ఈవీఎంలను భద్రపరిచిన గోదామును తనిఖీ చేశారు. ప్రతినెల ఈవీఎంలను తనిఖీ చేయడం జరుగుతుందని, గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు.సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించారు. గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కలెక్టర్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ తహశీల్దార్ రామ్మోహన్ పాల్గొన్నారు.