కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తాండూరు, అక్షిత ప్రతినిధి:
తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. హెడ్ మాస్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్లు మల్లేశం, వెంకటేశం, సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్య క్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులు, పాఠశాల యాజ మాన్యం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థుల మార్చ్‌పాస్ట్, పరేడ్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీ, దేశ భక్తితో విద్యను అభ్యసించి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, సూచించారు.
‘ఆజాదీ కి అమర్ గాథా’ ప్రత్యేక ఆకర్షణ.
విద్యార్థులు ప్రదర్శించిన ‘ఆజాదీ కి అమర్ గాథా (1857–1947) చారిత్రక నాటకం విశేషంగా ఆకట్టుకుంది. స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను విద్యార్థులు తమ నటన ద్వారా అద్భుతంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనూ నిర్వహించగా, ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ తదితరులు విద్యార్థులను అభినందించారు.జూనియర్ కేజీ విద్యార్థి రాష్ట్రాలు, రాజధానులు, శ్లోకాలు చెప్పి ఆకట్టుకోగా, ఐదో తరగతి విద్యార్థులు దేశభక్తి గీతం, మూడో తరగతి విద్యార్థులు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతపై ప్రసంగించారు. చివరగా విద్యార్థులు రాజ్యాంగ విలువలు, ఐక్యత, సమగ్రత, దేశభక్తిని కాపాడ తామని ప్రతిజ్ఞ చేశారు.

