విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంచేది యోగ, ధ్యానం

విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంచేది యోగ, ధ్యానం

– ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్‌లో యోగ, మెడిటేషన్ కార్యక్రమం

చిట్యాల అక్షిత ప్రతినిధి 

ప్రతిరోజూ యోగ, ధ్యానం చేయడం ద్వారా విద్యార్థుల్లో అచంచలమైన ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, ఆత్మస్థైర్యం పెంపొందుతాయని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు అన్నారు. సోమవారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని బీసీ హాస్టల్‌లో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగ, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనా విధానం పెంపొందించేలా యోగ, ధ్యానం, పద్మ సాధనలు, త్రీ స్టేజ్ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, భస్త్రిక తదితర సాధనలు చేయించారు. అనంతరం పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ ధ్యానం మానవ జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అని, ప్రతి విద్యార్థి తమ నిత్యజీవితంలో యోగ, ధ్యానాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ సూచించిన సుదర్శన్ క్రియ ద్వారా అంతర్గత శక్తిని గుర్తించి మానసిక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు. ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనశ్శాంతి, సానుకూల ఆలోచనలు, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని పేర్కొన్నారు. శాంతియుత సమాజ నిర్మాణం, ‘వసుధైవ కుటుంబం’ కోసం ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ధర్మపురి తార, ట్యూటర్ బాలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking