శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలకమైన పాత్ర

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలకమైన పాత్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వికారాబాద్, అక్షిత బ్యూరో : వికారాబాద్ జిల్లాలో నాలుగు నూతన పోలీస్ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొడంగల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్  (సీఐ ) కార్యాలయం, కొడంగల్ పోలీస్ స్టేషన్, బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ మరియు దుద్యాల పోలీస్ స్టేషన్లకు నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాటు రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , బీసీ సంక్షేమ శాఖ మంత్రి వాకాటి శ్రీహరి , ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి , సెర్ప్ సీఈఓ శ్రీమతి దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.అలాగే చార్మినార్ జోన్ డీఐజీ చందనా దీప్తి , వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ,వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా , జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా , సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి , శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి , టీ. రామ్మోహన్ రెడ్డి , వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన, నాణ్యమైన సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలు పోలీసు అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణాన్ని కల్పించడంతో పాటు, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ప్రజల సమస్యల పట్ల పోలీసులు సానుకూలంగా స్పందిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందించేలా పనిచేయాలని సూచించారు.పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల నమ్మకాన్ని పొందే విధంగా విధులు నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, పిల్లలు మరియు బలహీన వర్గాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking