అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభం

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభం

కళాశాల కో-ఆర్డినేటర్ ఎం. అంజయ్య

నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి :

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సార్వత్రిక అధ్యయన కేంద్రం లో ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు ఆదివారం తరగతులను ప్రారంభించిన్నట్టు కళాశాల కో-ఆర్డినేటర్ ఎం. అంజయ్య తెలిపారు. అనంతరం ఇండక్షన్ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులకు పలు ముఖ్యమైన విషయాలపై సూచనలు చేశారు.డిగ్రీలో కొత్తగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు విద్యా విధానం, ఉన్నత విద్యా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ అభివృద్ధి వంటి అంశాలను వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్న వివిధ స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు, స్కాలర్షిప్ అవకాశాలు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు అందుబాటులో ఉన్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ విద్యా ప్రగతితో పాటు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.ఆదివారం నుండి ప్రారంభమైన తరగతులకు క్రమం తప్పకుండా హాజరై విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking