అడ్రస్ మారిన పోలీస్ స్టేషన్

అడ్రస్ మారిన పోలీస్ స్టేషన్

సుబేదారి నుంచి భీమారంకు మారిన హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం.

మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత – అదనపు డీసీపీ బాలస్వామి

వరంగల్, అక్షిత బ్యూరో:

మహిళల భద్రత, హక్కుల పరిరక్షణకు పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని అదనపు డీసీపీ (క్రైమ్స్) బాలస్వామి అన్నారు.హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను, అదనపు డీసీపీ బాలస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా, అదనపు డీసీపీ మాట్లాడుతూ, గృహహింస, వేధింపులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మహిళలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బాధితులకు అవసరమైన రక్షణ, కౌన్సిలింగ్, వైద్య, న్యాయ సహాయం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

క్రైమ్ ఏసీపీ సదయ్య మాట్లాడుతూ, మహిళా పోలీస్ స్టేషన్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మహిళలకు సత్వర సహాయం అందిస్తామని తెలిపారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి డాక్టర్ పల్లెపాడు దామోదర్ మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న మహిళా సహాయక కేంద్రం ద్వారా ఇప్పటివరకు సుమారు 28 వేల మంది మహిళలకు వారి సమస్యల పరిష్కారానికి సేవలందించినట్లు తెలిపారు. అవసరమైన వారికి కౌన్సిలింగ్‌తో పాటు వైద్య, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పులి రమేష్, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking