మొత్తానికి జెనీలియా రీ ఎంట్రీ ఇస్తోంది!

జెనీలియా అంటే అందం .. అల్లరి. కథానాయికలుగా తెరపై అందాల సందడి చేసినవారు చాలామందే ఉన్నారు గానీ, జెనీలియా మాదిరిగా అల్లరి చేసినవారు లేరు. చిలిపిదనం .. చలాకీదనం జెనీలియాలో ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తాయి. తెలుగు .. తమిళ భాషల్లో ఎక్కువగా చేసిన ఆమె, మలయాళ .. కన్నడ .. హిందీ .. మరాఠీ సినిమాల్లోను కనిపించింది.

తెలుగులో జెనీలియా చేసిన సినిమాల్లో ‘సై’ .. ‘హ్యాపీ’ .. ‘బొమ్మరిల్లు’ భారీ విజయాలను అందుకున్నాయి. ‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతగా ఆమె ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులను ప్రభావితం చేసింది. వివాహమైన తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. పదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తోంది.

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి వారు నిర్మిస్తున్నారు. కన్నడ .. తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా నిన్ననే రాజమౌళి క్లాప్ తో మొదలైంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జెనీలియా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఆమె అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking