మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత
శోకసంద్రంలో అభిమానులు కార్యకర్తలు
తిరుమలగిరి, అక్షిత న్యూస్ :
రాష్ట్ర రాజకీయాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొని సంచలనం సృష్టించిన టైగర్ మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి బుధవారం రాత్రి కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా అయినప్పటికీ ఎమ్మెల్యేగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఆనాడు కమ్యూనిస్టుల ప్రాబల్యంతో పాటు వారికి కంచుకోటగా ఉండేది కమ్యూనిస్టుల కంచుకోటని బద్దలు కొట్టి అయిదు పర్యాయాలు శాసనసభ్యునిగా మంత్రిగా పనిచేసే జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు తుంగతుర్తి నియోజకవర్గంలో కమ్యూనిస్టుల భారీ నుండి కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను కాపాడుకొని వారికి రక్షణగా ఉండి అన్ని విధాల ఉండేవారు కమ్యూనిస్టుల దాడులను ఎదుర్కోవడంలో దామోదర్ రెడ్డి ఆరితేరిన వ్యక్తి
డి లిమిటేషన్ లో భాగంగా తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ కావడంతో సూర్యాపేట నుండి శాసనసభ్యులు విజయం సాధించారు.నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన నేను ఉన్నానంటూ ఆదుకొని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు నేడు ఆయన మృతి చెందాడని వార్త తెలియగానే తుంగతుర్తితో పాటు ఉమ్మడి జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుంగతుర్తి తన సొంత గృహం లోనే ఉంటూ హైదరాబాదులో ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారనే వార్తతో విషాదచాయలు నెలకొన్నాయి నాలుగో తేదీ సాయంత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో అంత్యక్రియలు జరుగనున్నాయి.