ఘనంగా తిప్పన పుట్టినరోజు వేడుకలు

ఘనంగా తిప్పన పుట్టినరోజు వేడుకలు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి పుట్టినరోజు వేడుకలను నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణంలోని వైదేహి టౌన్ షిప్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని తిప్పన విజయసింహా రెడ్డితో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయనకు స్వీట్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తిప్పన విజయసింహా రెడ్డి నిండు నూరేండ్లు ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, నిత్యం ప్రజాసేవలో కొనసాగాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జొన్నలగడ్డ రంగారెడ్డి, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, షోయబ్ ఖాన్, చిమట మదార్, కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్, గంగుల భిక్షం , జటావత్ వినోద్ నాయక్, అబ్బులు, విక్టర్ ,దొండ రామరాజు, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking