మొక్కజొన్న
రైతులను ఆదుకోవాలి
జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్
దావ వసంత సురేష్
జగిత్యాల, అక్షిత ప్రతినిధి :
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. బుధవారం రాయికల్ పట్టణంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగాలం రైతు కష్టపడి పండించిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయకుండా, కొనుగోలు సెంటర్లు ప్రారంభించకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదా…ఆనాడు రైతు బాంధవుడు కేసీఆర్ సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభింవారన్నారు. మద్దతు ధర కల్పించి రైతుకు నష్టం కాకుండా దళారి వ్యవస్థ లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసిన ఘనత మా కేసిఆర్ కు దక్కుతుందన్నారు. అకాల వర్షాలకు తడిచిన మొక్కజొన్న పంటను కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులకు రైతులు అమ్మడం తో రైతుకు ఒక క్వింటాల్ కు 600 నుండి 800ల నష్టంతో అమ్ముకుంటున్నాడు. కాబట్టి దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఈ నష్టాన్ని కూడా రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆనాడు ఓట్ల కోసం అన్ని పంటలకు మద్దతు ధర మరియు బోనస్ కల్పిస్తానని బోగస్ మాటలు చెప్పి గద్దె ఎక్కిన తర్వాత రైతుకు మొండి చేయి చూపిస్తున్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి 22 నెలలైనా కూడా ఇప్పటికే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ఉచిత బస్సు పథకం పెట్టి బస్సుల సంఖ్య తగ్గించి చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రైతులతో పాటు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలందరు తీవ్రంగా విసిగి పోయినారు మళ్ళీ కేసీఆర్ పాలన కావాలని తెలంగాణ ప్రజలు అంటున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా తప్పకుండా ఎగరడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ, మండల అధ్యక్షులు ఎలేటి అనిల్, బర్కం మల్లేష్, కో ఆర్డినేటర్ తుంగ శ్రీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సాయి కుమార్, మహేష్ గౌడ్, మహేందర్, మాజీ కో ఆప్షన్ సోహెల్, మాజీ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్, నాయకులు రామచంద్రం, వినోద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.