మండల వ్యాప్తంగా ఘనంగా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు

మండల వ్యాప్తంగా ఘనంగా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు

చేర్యాల, అక్షిత ప్రతినిధి: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం చేర్యాల పట్టణ మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి. చేర్యాల తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి తహసిల్దార్ శ్రీవాస్య సందీప్, ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీఓ సుధీర్ కుమార్, సివిల్ కోర్టులో బానోత్ శ్రీరామ్ నాయక్ త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఎగరవేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ, చేర్యాల పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ బానోతు రమేష్ నాయక్, చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంపై మార్కెట్ కార్యదర్శి కె. రవికుమార్, ఆబ్కారీ కార్యాలయంలో సీఐ నరసింహులు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ మనోహర్, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ఆయా పార్టీల కార్యాలయాల వద్ద అధికారులు, పార్టీల నాయకులు, ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థల వద్ద ప్రధానోపాధ్యాయులు, మరియు ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచులు, ప్రజా సంఘాలు, వాణిజ్య వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ స్వతంత్ర వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking