గాంధీ జయంతి వేడుకలు.. గ్రామసభలో అభివృద్ధి పనులపై చర్చ
– గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి:
– సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి
గుడిపల్లి, అక్టోబర్ 02 (అక్షిత ప్రతినిధి):
గుడిపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలతో పాటు వీబీజీ రామ్‌జీ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి, గ్రామ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ, అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అర్వపల్లి శ్రీను, పంచాయతీ కార్యదర్శి విజయరెడ్డి, వార్డు సభ్యులు ఎర్ర వంశీకృష్ణ, బోడ నాగరాజు, రమేష్, దారం సైదమ్మ, స్వామి, ఒట్టేపు శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సైదులు, వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు