పేదలకు సీఎం సహాయ నిధి వరం
*బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేసిన సర్పంచ్ ఇటిక్యాల పెంటమ్మ
చిన్నంబావి, అక్షిత న్యూస్:
చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సియంఆర్ ఫ్ ) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను గ్రామ సర్పంచ్ ఇటిక్యాల పెంటమ్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇటిక్యాల పెంటమ్మ మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయని, అలాంటి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరం లాంటిదని అన్నారు.ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారం, చొరవతో లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందడం సంతోషకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు కృష్ణప్రసాద్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ…పేద ప్రజలకు అనారోగ్య సమయంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఎంతో భరోసానిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల గంధం అరుంధతి, భర్త సంపంగి శంకర్ – రూ.96,000,మాచర్ల దివ్య, భర్త రాకేష్ గౌడ్– రూ.60,000, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి జూపల్లి కృష్ణారావుకి సర్పంచ్ ఇటిక్యాల పెంటమ్మ, మాజీ జడ్పీటీసీ సభ్యులు కృష్ణప్రసాద్ యాదవ్, ఉపసర్పంచ్ మురళి కృతజ్ఞతలు తెలిపారు.