జాతీయ వేదికపై నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా..
– నీతి ఆయోగ్ జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న కలెక్టర్.. సుపరిపాలన, ప్రజాసేవలో ఉత్తమ విధానాలపై చర్చ
నిర్మల్, నవంబర్ 17, అక్షిత ప్రతినిధి :
జాతీయ స్థాయిలో సుపరిపాలన, ప్రజాసేవలో వినూత్న విధానాల అమలుపై నిర్వహించిన కీలక వర్క్‌షాప్‌లో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, పాల్గొన్నారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన తొలి జాతీయ స్థాయి ‘లీడర్‌షిప్ యాజ్ మిషన్’ వర్క్‌షాప్‌కు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడం, పాలనలో నూతన విధానాలను ప్రోత్సహించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలపై ఈ వర్క్‌షాప్‌లో చర్చించారు. ప్రజాపాలనలో నాయకత్వ ప్రాధాన్యత, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు, పారదర్శకత, జవాబుదారీతనం, ఉత్తమ పరిపాలనా విధానాలపై జరిగిన చర్చల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరఫున జిల్లా పరిపాలనలో తన అనుభవాలను, ప్రజాసేవలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను జాతీయ స్థాయి ప్రతినిధులతో పంచుకున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సమర్థవంతమైన నాయకత్వం, వినూత్న ఆలోచనలు, పారదర్శక పాలనా విధానాలతో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చనే అంశానికి ఈ వర్క్‌షాప్ ప్రాధాన్యతనిచ్చింది…