మందమర్రి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

మందమర్రి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక

రూ.7 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు

పట్టణంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు

రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

మందమర్రి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం జిల్లాలోని మందమర్రి పట్టణంలో బి 1 క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం లబ్ధిదారులకు మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మందమర్రి మండల తహసిల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, డి.సి.సి. ప్రతినిధి రఘునాథ్ లతో కలిసి హాజరై చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ఆలస్యం చేయకుండా 2 రోజులలోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులకు సకాలంలో అందించాలని సూచించారు. నిరుపేదల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని, రానున్న 2 సంవత్సరాలలో మరో 2 లక్షల ఇండ్లను కలుపుకొని 5 సంవత్సరాల కాలంలో మొత్తం 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. మందమర్రి ప్రాంతం ఏజెన్సీ స్వభావం కలిగి ఉన్నందున సమస్య పరిష్కారానికి సింగరేణి సంస్థ సిఎండి తో చర్చించి సింగరేణికి చెందిన భూమిని సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ భూమిలో సుమారు 1 వేయి ఇండ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని తెలిపారు.మహిళలకు ఆర్.టి.సి. బస్సులలో ఉచిత ప్రయాణం, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు సుమారు 5 వేల రూపాయల వరకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మహిళల సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక స్థితిగతుల మెరుగుదలే ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. మందమర్రిలో 7 కోట్ల రూపాయలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు మంజూరు లభించిందని, పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఒకే ప్రాంగణంలో విద్య, వసతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా ఈ పాఠశాలను నిర్మించడం జరుగుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఈ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా అనువైన స్థలాన్ని పరిశీలించామని, వచ్చే ఏడాది మార్చి లోపు మంజూరు పొందేలా ప్రయత్నించి, నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రి ఏర్పాటుతో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, వైద్య అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం తగ్గుతుందని తెలిపారు.మందమర్రి మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సి.సి. రోడ్లు, మురుగునీటి వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టామని, రానున్న 3 నుంచి 4 నెలలలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటింటికీ తా త్రాగునీరు అందించేందుకు సుమారు 30 కోట్ల రూపాయలతో ఇందిరా వాటర్ స్కీమ్, అమృత్ వాటర్ స్కీమ్ అమలు చేయడం జరుగుతుందని, పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యలు తీరుతాయని తెలిపారుప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీరు, విద్యుత్ వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొదుపు పాటించాలని కోరారు. రైతులు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి లభ్యతను బట్టి పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని, నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి సాగు విషయంలో జాగ్రత్త వహించాలని, ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సుమారు 38 వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదించి, ఇప్పటివరకు 11 వేల కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని తెలిపారు.మందమర్రి ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం కొత్త మైన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎ.టి.సి. శిక్షణ కేంద్రం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని, జర్మన్ భాషలో శిక్షణ కల్పిస్తూ యువతకు విదేశాలలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 68 మంది అర్హులైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పనులు చేపట్టడం జరుగుతుందని, కోటపల్లి మండలంలో నూతన ఎస్.సి. వసతి గృహం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణానికి సుమారు 1.60 కోట్ల రూపాయలతో చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రామకృష్ణాపూర్‌లో సింగరేణి సంస్థ సహకారంతో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మందమర్రి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. మందమర్రి, భీమారం, జైపూర్ మండలాల్లో విద్యార్థుల నమోదు శాతం 10 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అమృత్ పథకం క్రింద మందమర్రిలో త్రాగునీటి పైప్‌లైన్ పనులు, క్యాతనపల్లిలో 2 నీటి ట్యాంకులు, పైప్‌లైన్ పనులు, చెన్నూర్ లో 3 నీటి ట్యాంకుల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రహదారులు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మహిళా భవనాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking