జుంటుపల్లి ఆలయానికి మహర్దశ

జుంటుపల్లి ఆలయానికి మహర్దశ*

రూ.20 కోట్లతో సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు

తొలి విడతలో రూ.10 కోట్లు.. రెండో విడతలో మరో రూ.10 కోట్లతో పునర్నిర్మాణ పనులు..

ఆలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన ఎండోమెంట్, ఇంజనీరింగ్ అధికారులు

తాండూరు, అక్షిత ప్రతినిధి :

తాండూరు, వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవా లయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ పునర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభి వృద్ధి నిధులు (ఎస్డీఎఫ్) నుంచి రూ.20 కోట్లు మంజూరు చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడత లో రూ.10 కోట్లు, రెండో విడత లో మరో రూ.10 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.ఈ మేరకు మంగళవారం ఎండో మెంట్ శాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆలయాన్ని సందర్శించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన, సర్వే నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన పనులను గుర్తించి, అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు చేపట్టారు.మొదటి విడతలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో అర్థ మంటపం, మహామంటపం, ఆంజనేయస్వామి ఆలయం, గోపురం, బలిపీఠం, తూర్పు రాజగోపురం తదితర నిర్మాణ పనులు చేపట్టాలని, ప్రతి పాదించారు.రెండో విడతలో మరో రూ.10 కోట్లతో ఆలయ కార్యాలయ గది, యాగశాల, వంటశాల, ద్వారాల నిర్మాణంతో పాటు పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాల అభివృద్ధి పనులు చేప ట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయిం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రతినిధులు, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తమరావు, జె. రాఘవేంద్రరావు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు నిధుల మంజూరుకు సానుకూలత వ్యక్తం చేశారని, తెలిపారు. ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు అనంతరం పునర్నిర్మాణ పనులు ప్రారంభ మవుతాయని, ఆశాభావం వ్యక్తం చేశారు.ఆలయ పునర్నిర్మాణం పూర్తయితే జుంటుపల్లి సీతా రామచంద్రస్వామి క్షేత్రం మరింత అభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక, మౌలిక సదు పాయాలు అందుబాటులోకి వస్తాయని, కరణం పురు షోత్తమరావు హర్షం వ్యక్తం చేశారు.ఈ సర్వే కార్యక్రమంలో ఎండోమెంట్ శాఖ సిబ్బంది, ఈఓ నాయక్, ఇంజనీరింగ్ ఏఈ తులసీరాం, ఏవో శాంత్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు జె. రాఘవేంద్రరావు, కరణం పురుషోత్తమరావు, పూజారి జోషి వాదిరాజ్, బి. వెంకట్ రెడ్డి, పి. అరవింద్ రెడ్డి, రాజకోటి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking