సీతారాంపల్లిలో ఘనంగా అమ్మవార్ల కొలుపు ఉత్సవాలు

సీతారాంపల్లిలో ఘనంగా అమ్మవార్ల కొలుపు ఉత్సవాలు

పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దంపతులు

మందమర్రి, అక్షిత ప్రతినిధి :

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లుల కొలుపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు పూర్వీకుల సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం ప్రేమ్‌సాగర్‌రావు, సురేఖ దంపతులను గ్రామస్తులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య, గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking