విద్యార్థులకు నోటుబుక్స్ పెన్నులు వాటర్ బాటిల్స్ పంపిణీ
అక్షిత న్యూస్, మునగాల :
పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు నోటుబుక్సు పెన్నులు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం అభినందనీయమని నరసింహులగూడెం మాజీ సర్పంచ్ నందిపాటి వెంకయ్య అన్నారు నరసింహుల గూడెం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కుంచం ఇందిర నరసయ్య కుమారుడు కుంచం సందీప్ సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తూ ఉన్నత ఉద్యోగం చేస్తూ ఊరుపై ఉన్న మమకారంతో తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ నోటుబుక్కులు పెన్నులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ప్రస్తుత కాలంలో పుట్టినరోజు సందర్భంగా వేలాది రూపాయలు అనవసర ఖర్చులు చేస్తున్నారని వేడుకల పేరుతో జలసాలు చేస్తూ యువత పక్కదోవ పడుతుందని అన్నారు ఇలాంటి సమయంలో గ్రామ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించటం సంతోషమన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సోమపంగు రేణుక గణేష్ ఉబ్బపల్లి నాగమణి అంగన్వాడి టీచర్ నందిపాటి సృజనారాణి గ్రామ యువకులు బొంత సిద్దు రెడ్డి గడ్డం శివ ఉపాధ్యాయులు పాల్గొన్నారు