నవ భారత ప్రగతికి… నెహ్రు స్పూర్తి

*నెహ్రూ ఆశయాలే నవభారత నిర్మాణానికి స్ఫూర్తి*

*మహాదేవుని శ్రీనివాస్*

కొమరవెల్లి, అక్షిత న్యూస్ :

కొమరవెల్లి మండల కేంద్రంలో దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ జయంతి రోజున జరుపుకునే ‘బాలల దినోత్సవం’ సందర్భంగా బాలలందరికీహృదయ పూర్వకశుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ విద్య, విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు భారత ప్రగతికి బాటలు వేశాయని అన్నారు. నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమానత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని కోరారు.ప్రతిచిన్నారిలోనూ అపారమైన ప్రతిభ, సృజనాత్మకత, నూతన ఆలోచనలు దాగి ఉంటాయని నెహ్రూ విశ్వసించేవారని గుర్తుచేశారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారిప్రతిభనుప్రోత్సహిస్తూ, భయంలేని బాల్యాన్ని అందించి, వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించాలని అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే నెహ్రూ ఆశయాలకు నిజమైన నివాళి అని మహదేవుని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking