ఆర్టిఐ మానిటరింగ్
సభ్యునిగా బైరు సైదులు గౌడ్
నియామక పత్రం అందించిన జిల్లా కలెక్టర్
ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఐ అమలుకు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్
అధికారులకు ప్రజలకు
మధ్య వారధిగా ఉంటా
సైదులు గౌడ్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
సమాచార హక్కు జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడుగా పట్టణానికి చెందిన బైరు సైదులు గౌడ్ ను నియమించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక్రవారంనాడు తన కార్యాలయంలో సైదులు గౌడ్ కు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులంతా సమాచార హక్కును పటిష్టంగా అమలు చేసే విధంగా నూతన సభ్యుడు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, జిల్లా ప్రజా సమాచార అధికారులు, సహాయ అధికారులకు చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ కార్యాలయాలు దరఖాస్తులు చేసుకున్న ప్రజలకు తగిన సూచనలు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఆర్టిఐ సభ్యునిగా నియామక పత్రం అందుకున్న బైరు సైదులు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్లుగా నల్గొండ జిల్లాలో సమాచార హక్కు వికాస సమితి ద్వారా ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించడమే కాకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కృషి చేశానని తన కృషికి గుర్తింపుగా ఆర్టిఐ మానిటరింగ్ సభ్యునిగా నియమించడం సంతోషదాయకమన్నారు మానిటరింగ్ కమిటీ సభ్యునిగా ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తారని హామీ ఇచ్చారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడానికి వారి ఇబ్బందులను తొలగించడానికి శాశ్వత కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో సభ్యులుగా నియమించడానికి కృషిచేసిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా రెవిన్యూ అధికారి దశరథ్, ఆర్డిఓ అశోక్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా తన నియామకానికి సహకరించిన సమాచార హక్కు వికాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి, ఆర్ టిఐ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు, సమాచార హక్కు వికాసమితి రాష్ట్ర గౌరవ సలహాదారు కోటగిరి దైవాధీనం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ కొదుమూరి దయాకర్ రావు మారం గోనారెడ్డి గాదె వినోద్ రెడ్డి ఎర్ర మాద హేమలత బోగరి రామకృష్ణ గంధ మల్ల జయంత్ యాళ్లi చంద్రారెడ్డి సమాచార హక్కు వికాసంతి జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియామక పత్రం అందుకున్న కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ వై కృష్ణారెడ్డి చిత్రం శ్రీనివాస్ కర్ణాటక యాదగిరి తుంగతుర్తి రామకృష్ణ గంటె కంపు గణేష్ , భీమనపల్లి నగేష్ ఆదిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు మండలం ఎలగల గూడెం గ్రామంలో జన్మించిన బయలు సైదులు గౌడ్ నల్గొండలో ఉన్నత విద్యను అభ్యసించి 2009లో ఎంఏ పట్టా పొందారు అనంతరం సమాజ సేవ ప్రవృత్తిగా చేసుకొని సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు నడుము కట్టారు సుమారు దశాబ్ద కాలం క్రితం సమాచార హక్కు వికాస సమితి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారు. ఆయన కృషికి గుర్తింపుగా రాష్ట్ర ఆర్టిఐ కమిషనర్ కార్యాలయం ఆదేశాల మేరకు ఆర్.టి.ఐ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు..