పల్లెల ప్రగతికి కృషి

గ్రామాల అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పనితీరుపై ప్రశంసలు

గడ్డంపల్లి సర్పంచ్ వెన్నెల శేఖర్

నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి :

తెల్కపల్లిలోని బీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గడ్డంపల్లి సర్పంచ్ వెన్నెల శేఖర్ , స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా వెన్నెల శేఖర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మంచితనం, నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో మమేకమయ్యే తీరు ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ని తాము ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి లో చూసుకుంటున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత కారణంగా రాబోయే ఎన్నికల్లోనూ ఆయనే మళ్ళీ విజయం సాధిస్తారని, ఎప్పటికీ మా ఎమ్మెల్యేగా ఆయనే కొనసాగుతారని వెన్నెల శేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking