బిఆర్ఎస్వి కో-కన్వీనర్ అనిల్ రెడ్డికి పరామర్శ
సూర్యాపేట, అక్షిత బ్యూరో :
బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కో-కన్వీనర్,సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జి ముదిరెడ్డి అనిల్ రెడ్డి పితృమూర్తి ముదిరెడ్డి సురేందర్ రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.కాగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి,పార్టీ జిల్లా సీనియర్ నాయకులు దేశగాని శ్రీనివాస్ గౌడ్ ,సీనియర్ పాత్రికేయులు బుక్క రాంబాబు, ఊటుకూరి రవీందర్ లతో కలిసి సురేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరo ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో ఆదిమల్ల వేణు,మధు నాయుడు,పవన్ తదితరులు ఉన్నారు.