ఇందిరమ్మ సేవలు చిరస్మరణీయం

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో కౌన్సిలర్ పల్లె శ్రీదేవి రాజు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వడ్నాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పింఛన్ పత్రాలను కౌన్సిలర్ పల్లె శ్రీదేవి రాజు ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల రమేష్, ఎర్రల శంకర్, ఇబ్రహీం, నాగరాజు, డాక్టర్ రాజా, గొల్ల మల్లేష్, రామ్ సాయి, మల్లెద్దుల రాజేష్, ఆడపు చంద్రమోహన్, రాజేశ్వరి, సునంద, జూల మధునయ్య, తాండ్ర అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking