పాలసీ బంధం.. సేవా అనుబంధం!

పాలసీ బంధం..
సేవా అనుబంధం!

జన్మదినానికి
    సేవా తోరణం

సంబరాల్లో
    సేవా స్ఫూర్తి

పాలసీదారుడి జన్మదినాన్ని
    పురస్కరించుకొని సేవలు

బసవతారకం క్యాన్సర్
ఆసుపత్రి వద్ద వెయ్యి మందికి భోజన వసతి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి:

పాలసీదారుడితో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సేవా కార్యక్రమం ద్వారా చాటుకున్నారు ప్రముఖ జీవిత బీమా సలహాదారు కౌటికె విఠల్. సీల్‌వెల్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బండారు సుబ్బారావు జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద సుమారు వెయ్యి మందికి సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఎల్‌ఐసీ సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రభాత్ కుమార్ సాహు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జన్మదిన కేక్ కట్ చేసి అక్కడున్న వారికి పంచిపెట్టారు. అతిథులతో కలిసి స్వయంగా భోజనాలు వడ్డించి సేవా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాత్ కుమార్ సాహు మాట్లాడుతూ, పాలసీదారుడి జన్మదినాన్ని సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. పాలసీదారులతో ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ, వారి ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలుగా మలచడం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భారత దేశంలో నంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా సేవలందిస్తున్న కౌటికె విఠల్, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సహాయం అందిస్తున్నారని ప్రశంసించారు. పాలసీదారుడి జన్మదినాన్ని ఈ స్థాయిలో సేవా కార్యక్రమంతో నిర్వహించడం ప్రత్యేకమైన విషయమని కొనియాడారు.


కౌటికె విఠల్ మాట్లాడుతూ, తమపై నమ్మకంతో బీమా పాలసీలు తీసుకున్న పాలసీదారులు, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బండారు సుబ్బారావు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించే అవకాశం రావడం ఎంతో ఆత్మసంతృప్తి నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరి ఆశీస్సులు ఆయనకు, ఆయన కుటుంబానికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్, సీఎల్‌ఐఏ మేనేజర్ ప్రభాకర్, సిటీ బ్రాంచ్-8 బ్రాంచ్ మేనేజర్ రవికిరణ్, అడ్వకేట్ మడుపల్లి రవి గుప్తా పాల్గొని విఠల్ సేవా చొరవను అభినందించారు. ఆయన సతీమణి కౌటికె కావ్య, కుమారుడు కౌటికె ఆదిత్య అతిథులకు స్వాగతం పలికి, కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అవోపా హైదరాబాద్ కోశాధికారి మాకం బద్రీనాథ్‌తో పాటు విఠల్ మిత్రులు, శ్రేయోభిలాషులు కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. అతిథులందరూ స్వయంగా భోజనాలు వడ్డించి సేవలో భాగస్వాములయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking