వీర్లపాలెంలో అక్రమ అరెస్టులు..

వీర్లపాలెంలో అక్రమ అరెస్టులు..

పరిశ్రమను వ్యతిరేకించే ప్రజలను అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు.

అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి లాక్కెళ్ళిన పోలీసులు..

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం..

ప్రజలను స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు అనుమతించాలి..

అరెస్టు చేసిన గ్రామ ప్రజలను వెంటనే విడుదల చేయాలి

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ
తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్

దామరచర్ల, అక్షిత న్యూస్ :

ఈనెల 20న సోహం ఆగ్రో ఇండస్ట్రీస్ పరిశ్రమపై వీర్లపాలెం గ్రామంలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనకుండా వాడపల్లి పోలీసులు స్థానిక ప్రజలను అరెస్టు చేస్తున్నారని తెలంగాణ విద్యావంతుల వేదిక, నల్గొండ  జిల్లా అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది పందుల సైదులు ఆరోపించారు. ఇండ్లలోకి వచ్చి ప్రజలను బెదిరిస్తున్నారు. వీర్లపాలెం గ్రామ ప్రజలైన 1.నినావత్ సిపాయి 2. అల్లం నాగరాజు వార్డ్ నెంబర్ 3. గుంజ రామయ్య వార్డు నెంబర్.4 అంగోతు బాలు, వార్డు మెంబర్ 5. రుపావత్ సైద్ వార్డ్ 6. రమావత్ వినోద్ లను గ్రామంలో ఉన్నవారిని అక్రమంగా వాడపల్లి పోలీసులు అరెస్టు చేసినారు. వారు ఎక్కడ ఉన్నది తెలవక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారిని వెంటనే విడుదల చేసి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే అవకాశం కల్పించాలని పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్స్ కన్నెగంటి రవి, కే రవిచంద్ర, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పోలీసులను డిమాండ్ చేశారు.విషతుల్యమైన పరిశ్రమను వ్యతిరేకించడం ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అని, వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించకుండా పోలీసులు అక్రమం అరెస్టు చేయడం సరికాదన్నారు. అరెస్టు చేసిన ప్రజలను వెంటనే విడుదల చేసి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే విధంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking