విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

చేర్యాల, అక్షిత ప్రతినిధి :

చేర్యాల మండలంలోని నాగపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది.ఈ స్వయం పరిపాలన దినోత్సవం లో విద్యార్థిలే ఉపాధ్యాయులై వారి వారి ఉపాధ్యాయ పాత్రలకు న్యాయం చేస్తూ పాఠాలు బోధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. స్వయం పరిపాలన దినోత్సవం వల్ల విద్యార్థులు చదువు యొక్క ప్రాముఖ్యత సమయపాలన స్వీయ క్రమశిక్షణ పాఠశాల తరగదు గది నిర్వహణ విద్యార్థులు అదుపు చేయడం నిజ ఉపాధ్యాయుల సాధకబాధకాలు లాంటి అనేక విషయాల్లో అనుభవాన్ని గడిస్తారని అన్నారు. అంతేకాకుండా ఆత్మ పరిశీలన అవగాహన సర్దుబాటు సమూహ మెలకువలు లాంటి అంశాలలో అనుభవాన్ని పొందుతారు అన్నారు. ఈ ప్రపంచంలో అసలైన నిజమైన అతి పెద్ద గురువు అతి గొప్ప గురువు ఎవరంటే అనుభవమేనని తెలిపారు.
విద్యార్థులు వారు పోషించిన, బోధించిన విషయాలను తరగతి అనుభవాలను అనుభూతులనుఅనుపయుక్తాలను ఆచరణలను ఆలోచనలను అనుచితాలను అల్లరి ఆకతాయి వేషాలను ఆవరణలో అజమాయిషి విధానాల తో పాటు అనేక అనేక అంశాలను వివరించారు.
స్వయం పరిపాల దినోత్సవం లో పాల్గొన్న వారిలో ప్రథమ బహుమతి సిహెచ్ జాహ్నవి, ద్వితీయ బహుమతి బి దీక్షిత, తృతీయ బహుమతి ఎన్ లతిక డీఈవో వర్షిని, డిప్యూటీ డిఈఓ అలేఖ్య, హెడ్ మాస్టర్ గా మనోహర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking