సిద్దిపేట బహిరంగ సభలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి
చేర్యాల, అక్షిత ప్రతినిధి :
చేర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ బాల నరసయ్య హాజరై మాట్లాడుతూ.. నేడు సిద్దిపేటకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సందర్భంలో పిసిసి ప్రెసిడెంట్ హోదాలో జనగామ మీటింగు లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ను చేస్తానని మాట ఇచ్చి నేటికీ అధికారంలోకి వచ్చి3 సంవత్సరంలుఅయినప్పటికీ అమలు చేయకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి నేటి సిద్దిపేట సభలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ను ప్రకటించాలని విజ్ఞప్తి చేసారు. అలాగే చేర్యాల ప్రాంత సమస్యలైన త్రాగునీరు సాగునీరు విషయంలో మల్లన్న సాగర్ నుండి గ్రావిటీ ద్వారా తపస్పల్లి డ్యామ్ లోకి నీటిని నింపాలని గత ముఖ్యమంత్రి కెసిఆర్ మల్లన్న సాగర్ నుండి కాలువ తవ్వి తపస్ పల్లి డ్యాముకు నీళ్లు ఇవ్వడానికి380 కోట్లు తో కొంతమేర కాలువ తవ్వడం జరిగిందని, మిగతా కాల్వ పనిని వెంటనే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, ఎలినో ప్రభావంతో వర్షాలు పడకపోగా ఈ ప్రాంతంలో వేల ఎకరాల పంట నష్టం జరిగిందని, చేర్యాల కొమరవెల్లి మద్దూరు దూల్మిట్ట మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రతి రైతుకు నష్టపరిహారంగా అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నిమ్మ సుప్రజ రాజీవ్ రెడ్డి, కమలాపురం గీతాంజలి, బుధాది సురేష్, నాయకులు ముస్త్యాల బాల నర్సయ్య, అంకు గారి శ్రీధర్ రెడ్డి, పూర్మ వెంకటరెడ్డి, మంగోల్ చంటి, టౌన్ జెయింట్ సెక్రెటరీబురగోని తిరుపతి గౌడ్, శివ గారి అంజయ్య, యాట యాదగిరి, రాళ్ల బండి పరిపూర్ణం, కందుకూరి సిద్ధి లింగం గుప్తా, తదితరులు పాల్గొన్నారు.